జూలై 4 నుంచి తానా మహాసభలు

జూలై 4 నుంచి తానా మహాసభలు

05-12-2018

జూలై 4 నుంచి తానా మహాసభలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు జూలై 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్‌ నగరంలో జరుగబోతున్నాయి. ఈ సందర్భంగా తానా నవలల పోటీ నిర్వహిస్తున్నది. ఈ మేరకు తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, కార్యక్రమ నిర్వాహకులు జంపాల చౌదరి, ప్రచురణల కమిటీ ఆధ్యక్షుడు చంద్ర కన్నెగంటి ఒక ప్రకటన విడుదల చేశారు. తానా నవలల పోటీలకు రచనలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రచనలు పంపించేందుకు చివరి తేది 2019, మార్చి 30 వరకు పంపించాలని కోరారు. ఉత్తమ నవలకు రూ.2 లక్షల బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. రచనలను అక్షర క్రియేటర్స్‌, ఎజి-2, ఎ బ్లాక్‌, మాతృశ్రీ అపార్ట్‌మెంట్స్‌, హైదరాబాద్‌-500029కు పంపాలని సూచించారు. ఇతర వివరాలకు 98493 10560, 040-23244088 నెంబర్లను సంప్రదించాలని కోరారు.