విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త

10-01-2019

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త వెల్లడించింది. తమ విమానాల్లోని బిజినెస్ క్లాస్ లో సీట్లు ఖాళీగా ఉండటం వల్ల నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎకానమీ క్లాస్ టికెట్లు పొందిన ప్రయాణికులు బిజినెస్ క్లాస్ లో ఖాళీ ఉంటే అప్ గ్రేడ్ చేస్తే కొత్త పథకాన్ని ఎయిర్ ఇండియా ఆరంభించింది. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, జపాన్, హాంగ్ కాంగ్ దేశాలతోపాటు దేశంలోని ఆరు మెట్రో నగరాలకు ప్రయాణించే ఎకానమీ క్లాస్ ప్రయాణికులు బిజినెస్ తరగతిలో ఖాళీ ఉంటే 75 శాతం ఆదాతో ప్రయాణించే అకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా సీఎండీ ప్రదీప్సింగ్ ఖరోలా వెల్లడించారు.