దావాస్ పర్యటన రద్దు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు

దావాస్ పర్యటన రద్దు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు

12-01-2019

దావాస్ పర్యటన రద్దు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు

ఆర్థిక ప్రతిష్టంభన నేపథ్యంలో నిరసనలు ఎదుర్కొనాల్సి వస్తుందనే భయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దావోస్‌ పర్యటను రద్దు చేసుకున్నారు. కాగా ఈ నెల 22 నుంచి 25 వరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే 20 రోజులుగా ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహణకు నిధుల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో దావోస్‌ సమావేశాల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా అనేది తెలియరావడం లేదు. అమెరికా మెక్సికో సరిహద్దులో నిర్మించ తలపెట్టిన గోడ నిర్మాణానికి నిధుల కోసం ట్రంప్‌, డెమోక్రాట్ల మద్య ఘర్షణ జరుగుతోంది. సరిహద్దు భద్రతపై డెమోక్రాట్ల మొండితనం వల్ల దావోస్‌ పర్యటనను తాను రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్‌ తెలిపారు.