భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్

భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్

12-01-2019

భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్

డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ పేరు చెబితే అమెరికాలోని హెచ్‌ 1బీ వీసాదారులు వణికిపోతుంటారు. ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందోనని ఆందోళనకు గురవుతుంటారు. కానీ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఒకే ఒక ట్వీట్‌ అమెరికాలోని హెచ్‌-1బీ వీసాదారులకు ఆనందాన్ని కలగజేస్తోంది. అమెరికాలోని హెచ్‌-1బీ వీసాదారులు ఇకపై భరోసాగా ఉండొచ్చు. అమెరికాలో నివసించేందుకు, పౌరసత్వాన్ని సులభంగా పొందేందుకు త్వరలోనే మార్పులు చేయనున్నాం. సమర్థవంతమైన, అధిక నైపుణ్యం కలిగినవారు అమెరికాలో జీవితాన్ని కొనసాగించేందుకు పోత్సహించనున్నాం అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ అనేక మంది ఐటీ నిపుణులను ఆశ్చర్యానికి, అమితానందానికి గురిచేస్తోంది. హెచ్‌-1బీ వీసా విషయంలో కఠిన నిబంధనలు తీసుకొస్తామని మొదటి రెండు సంవత్సరాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ట్రంప్‌ తాజా ట్వీట్‌ చూసి ఐఐటీ నిపుణులు సంబరపడుతున్నారు. అత్యధిక హెచ్‌-1బీ వీసాలు పొందుతున్న భారతీయ ఐటీ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌరుసత్వం, గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులు ఆశలు ట్రంప్‌ ట్వీట్‌తో ఒక్కసారిగా చిగురించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.