వారం రోజుల్లో ఐసిస్ అంతం : ట్రంప్

వారం రోజుల్లో ఐసిస్ అంతం : ట్రంప్

08-02-2019

వారం రోజుల్లో ఐసిస్ అంతం : ట్రంప్

మరో వారం రోజుల్లో సిరియాలో ఉగ్ర సంస్థ ఐసిస్‌ పూర్తిగా కనుమరుగవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఇప్పటికే ఆ దేశంలో ఐసిస్‌ను భారీ ఎత్తున దెబ్బతీశామని, మిగిలిన స్థావరాలను కూడా వారం రోజుల్లో ఐసిస్‌ కోల్పోనుందని చెప్పారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు 70కి పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. సిరియా, ఇరాక్‌లలో యూఎస్‌ మిలటరీ, తమ భాగస్వాములు, సిరియన్‌ డెమోక్రాటిక్‌ బలగాలు కలసి ఐసిస్‌ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాయని ఈ సందర్భంగా ట్రంప్‌ చెప్పారు. వారం రోజుల్లో సిరియాలో ఇస్లామిక్‌ టెర్రరిజాన్ని పూర్తిగా అంతమొందించామనే విషయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అందమొందించే విధానికి అమెరికా కట్టుబడి ఉంటుందని చెప్పారు.