భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా

భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా

09-02-2019

భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా

భారతీయ ఐటీ నిపుణులకు మేలు చేకూర్చే కీలక బిల్లులను అమెరికా కాంగ్రెస్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. గ్రీన్‌ కార్డుల మంజూరుపై ఎలాంటి పరిమితులు విధించవద్దని.. ఒక్కో దేశం నుంచి పరిమిత సంఖ్యలో మాత్రమే నిపుణులను తీసుకోవాలన్న నిబంధనలను సవరించాలన్నది ఈ సారూప్య బిల్లుల సారాంశం. గూగుల్‌ సహా సిలికాన్‌ వ్యాలీలోని అగ్ర కంపెనీలు, అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వంటి కార్పొరేట్‌ సంస్థల చొరవతో ఉభయ సభల్లో శక్తిమంతులైన సీనియర్‌ సభ్యులు పార్టీలకతీతంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశారు. కాంగ్రెస్‌ ఆమోదించి.. ఇవి చట్టాలుగా మారితే.. హెచ్‌ 1బీ వీసాలపై అమెరికా వెళ్లి, అక్కడ చట్టబద్ధంగా శాశ్వత నివాసానికి ఎదురుచూస్తున్న వేల మంది భారతీయ నిపుణులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అంతేగాక ప్రతి దేశానికి విధించిన ఏడు శాతం పరిమితి 15 శాతానికి పెరుగుతుంది. రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ మైక్‌ లీ, భారత సంతతి సెనేటర్‌ కమలా హారిస్‌ కలిసి ఫెయిర్‌వేస్‌ ఫర్‌ హైస్కిల్డ్‌ ఇమిగ్రేంట్స్‌ యాక్టు పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో కూడా ఇలాంటి బిల్లునే సభ్యుడు జో లాఫ్‌గ్రెన్‌ ప్రవేశపెట్టారు.