అమెరికాలో చంద్రబాబుకు ఘనస్వాగతం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

అమెరికాలో చంద్రబాబుకు ఘనస్వాగతం

04-05-2017

అమెరికాలో చంద్రబాబుకు ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగాఉన్న జయరామ్‌ కోమటి సారధ్యంలో ఎన్నారై టీడిపి అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన వాషింగ్టన్‌ డీసి నుంచి, డల్లాస్‌ నుంచి కేసీ చేకూరి, ఛార్లెట్‌ నుంచి చందు గొర్రెపాటి, సెంట్‌లూయిస్‌ నుంచి రాజా సూరపనేని, వర్జీనియా నుంచి రఘు, ఇండియా నుంచి వచ్చిన ప్రసాద్‌ గారపాటి, చెన్నూరి సుబ్బారావు, బే ఏరియాలో ఉన్న ఎన్నారై టీడిపికి చెందిన వెంకట్‌ కోగంటి, మధు రావెళ్ళ, రజనీకాంత్‌ కాకరాల, రామ్‌ తోట, బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) నాయకులు విజయ ఆసూరి, శిరీష బత్తుల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, సిలికానాంధ్ర తెలుగు అసోసియేషన్‌ ప్రముఖులు  రాజు చామర్తి, దీనబాబు కొండబోలు, నిరుపమతోపాటు ఇతరులు భక్త బల్లా, సుబ్బ యంత్ర, కృష్ణమోహన్‌ తదితరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఎపి కూచిపూడి నాట్యారామం చైర్మన్‌ ఆనంద్‌ కూచిభొట్ల కూడా చంద్రబాబుకు స్వాగతం పలికారు.

చంద్రబాబు విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే జై చంద్రబాబు స్లోగన్‌తో ఆ పరిసరాలు మిన్నంటాయి. తొలుత జయరామ్‌ కోమటి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి పచ్చకండువాతో ఆయనకు స్వాగతం పలికారు. తరువాత ఎంతోమంది ఆయనకు పుష్పగుఛ్చాలు ఇచ్చి చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహపడ్డారు.

భారత ప్రభుత్వం తరపున శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సిల్‌ జనరల్‌ వెంకటేశన్‌ అశోక్‌ చంద్రబాబుకు స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎపి ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ సిఇఓ కృష్ణ కిశోర్‌, మీడియా అడ్వయిజర్‌ పరకాల ప్రభాకర్‌, ఎపిఎన్‌ఆర్‌టి చైర్మన్‌ రవి వేమూరు రాగా, ఐటీ అడ్వయిజర్‌ జె.ఎ. చౌదరి, ఐటీ సెక్రటరీ విజయానంద్‌, తదితరులు ముందుగానే అమెరికా వచ్చారు.

Click here for Photogallery