న్యూయార్క్ లో భారతీయుల ప్రదర్శన

న్యూయార్క్ లో భారతీయుల ప్రదర్శన

23-02-2019

న్యూయార్క్ లో భారతీయుల ప్రదర్శన

ఇటీవల భారత జవాన్లను ఉగ్రవాదులు బాంబు పేలుడుతో హతమార్చడాన్ని నిరసిస్తూ న్యూయార్క్‌లో ఉంటున్న భారతీయులు దాదాపు నాలుగు వందల మంది వీధుల్లోకి వచ్చి పాక్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు.  పాకిస్తాన్‌ ఎంబసీ కార్యాలయం ముందు చేరి వారంతా పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇటీవల జమ్మూలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల వాహనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడికి వ్యతిరేకంగా భారతీయులు పెద్ద సంఖ్యలో పాక్‌ ఎంబసీ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దాడి వెనుక పాక్‌ హస్తం ఉందని వారు ఆరోపించారు. న్యూయార్క్‌తోపాటు చికాగోలో భారతీయులు పాక్‌ ఎంబసీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. భారత్‌లో శాంతి భద్రతలకు భంగం కలిగించాలన్నది పాక్‌ ఉద్దేశమని వారు అభిప్రాయపడ్డారు. అయితే పాక్‌ ఎంత ప్రయత్నించినా అది జరిగే పని కాదన్నారు. తీవ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్‌కు బుద్ధి చెప్పాలంటే ప్రపంచదేశాలన్ని భారత్‌కు సహకరించాలని వారు కోరారు.