ప్రవాస సీఈఓలతో చంద్రబాబు భేటీ
MarinaSkies
Kizen

ప్రవాస సీఈఓలతో చంద్రబాబు భేటీ

06-05-2017

ప్రవాస సీఈఓలతో చంద్రబాబు భేటీ

జన్మభూమి రుణం తీర్చుకునే తరుణం వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. మాతృభూమికి ఎన్నడూ దూరం కావొద్దని, పుట్టిన గడ్డతో నిరంతరం సంబంధాలు నెరపాలని సూచించారు. ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్ ఒక అత్యుత్తమ అభ్యాసాన్ని (బెస్ట్ ప్రాక్టీస్) అందించాలని అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజైన శుక్రవారం నాడు అక్కడ స్థిరపడ్డ భారతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఇక్కడ మీ వ్యాపార, వాణిజ్యా కార్యకలాపాలు కొనసాగిస్తూనే మాతృదేశంలో కూడా విస్తరించాలని, సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని విందు సమావేశంలో కోరారు. 

అనంతరం మూడు ముఖ్యమైన సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఈవీఎక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీతోనూ, 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ‘ఇన్నోవా సొల్యూషన్స్’తోనూ, ఇంక్యుబేటర్, కో - వర్కింగ్ స్పేస్ అంశాలలో సహకరించేందుకు ఐ-బ్రడ్జి (I-BRIDGE INC)తో మరో ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది.


Click here for Photogallery