డల్లాస్ లో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం
MarinaSkies
Kizen

డల్లాస్ లో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం

08-05-2017

డల్లాస్ లో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం

అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రవాస తెలుగువారి నుంచి అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. శనివారం డల్లాస్ వెళ్లిన ముఖ్యమంత్రి బృందానికి విమానాశ్రయంలో స్థానిక తెలుగువారంతా అపూర్వంగా ఆహ్వానించారు. జై బాబు, జై జై బాబు నినాదాలతో హోరెత్తించారు. తెలుగువారి ఆత్మీయ స్వాగతానికి పరవశించిన ముఖ్యమంత్రి తాను 2007లో ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు డల్లాస్‌లో పర్యటించానని, అప్పుడు మీరు ఎంతో ఆప్యాయత కనబరచడంతో మరోసారి రాకుండా వుండలేకపోయానని గుర్తు చేశారు. డల్లాస్ రాకపోయివుంటే తన అమెరికా పర్యటన సంపూర్ణమయ్యేది కాదన్నారు. 

 

Click here for Photogallery