డాలస్ నగరం లో మే 4 న ప్రవాస భారతీయోత్సవం

డాలస్ నగరం లో మే 4 న ప్రవాస భారతీయోత్సవం

24-04-2019

డాలస్ నగరం లో మే 4 న ప్రవాస భారతీయోత్సవం

ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటన లో ఆ సంస్థ ఆధ్వర్యంలో కాప్పెల్ నగరం లోని సైప్రేస్స్ వాటర్ ప్రాంతం లో “భారతీయులందరూ అమెరికా జనజీవన స్రవంతి లో భాగం కావాలి అనే పిలుపునిస్తూ ప్రవాస భారతీయ ఉత్సవం  మే 4 వ తేదీన మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుందని ప్రకటించారు. పార్కింగ్ తో సహా ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే.

ఈ కార్యక్రమం లో భాగం గా పిల్లల వినోదం కోసం ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’,  ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’, ‘రంగు రంగుల బెలూన్స్ పంపకం’ మొదలైనవెన్నో ఏర్పాట్లు చేశామని, వివిధ రకాల వంటకాలతో కూడిన ఫుడ్ స్టాల్స్  మరియు ఇతర బిజినెస్ స్టాల్స్ ఉంటాయని తెలిపారు.

500 మందికి పైగా భారత సంతతికి చెందిన వారి తో పాటు అమెరికన్ యువతీయువకులు కూడా అనేక సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. 80 మందితో కూడిన విద్యార్ధినీ విద్యార్ధులు “కాప్పెల్ స్కూల్ బ్యాండ్” లో పాల్గొనడం ఒక ప్రత్యేక ఆకర్షణ.      

అమెరికా గాట్ టాలెంట్ షో కు సెలెక్ట్ అయిన హైదరాబాద్ కు చెందిన క్రాంతి కుమార్ అనే యువకుడు చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కు లో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, సల సలా మరిగే నూనెను చేతులతో త్రాగడం,32 పొడవాటి కత్తులను గొంతు లో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటి తో మేకు కొట్టడం లాంటి అనేక సాహస కృత్యాలను ప్రదర్శించడానికి, పాటలను రివర్స్ లో పాడే ప్రక్రియతో కొన్ని వందల కార్యక్రమాలు యిచ్చి ఎన్నో ప్రశంసలు పొందిన “రివర్స్ గేర్ గురుస్వామి” అందర్నీ అలరించడానికి ప్రత్యేకంగా వస్తున్నారు.

భారత సంతతికి చెందిన  యూ. ఎస్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తి, నార్త్ కరోలిన స్టేట్ సెనెటర్ జై చౌదరి, వాషింగ్టన్ స్టేట్ సెనెటర్ మాంకా డింగ్ర, ఒహాయో స్టేట్ రిప్రెసెంటేటివ్ నీరజ్ అంటాని, మేరీలాండ్ స్టేట్ రిప్రెసెంటేటివ్ జై  జలిసి, ఆరిజోనా స్టేట్ రిప్రెసెంటేటివ్ డా. అమిష్ షా తో పాటు టెక్సస్  స్టేట్ రిప్రెసెంటేటివ్స్  మిషల్ బెక్లీ, జూలీ జాక్సన్, టెర్రీ మిజా, మ్యాట్ షాహీన్ హాజరవుతున్నారు.

అర్హత కల్గిన ప్రవాస భారతీయులందరూ అమెరికా దేశ ఎన్నికల్లో  పాల్గొనేందుకు వీలు గా ఓటు హక్కు ను నమోదు చేసుకోవడానికి ఈ ఉత్సవం లో అవకాశం కల్పిస్తున్నాము. రాత్రి 9 గంటలకు కనుల విందు కల్గించే అత్యంత వైభవం గా ఫైర్ వర్క్స్ ఉంటాయి.   

ఇండియన్ ఎంబసీ నుండి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, హ్యుస్టన్ నుండి కాన్సల్ రాకేష్ బనాటి, విప్రో సంస్థ సీఈఓ అబిద్ ఆలి నీముచ్వాలా, కాప్పెల్ నగర పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరిండేంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు

సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వం తో కూడిన ఈ ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్’ లో బోర్డు అఫ్ డైరెక్టర్స్ - జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా. సత్ గుప్తా, రన్నా జానీ, రామ్ కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠి వివిధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

పూర్తి వివరాలకు www.iafcusa.org ను సంప్రదించండి