దేవేందర్‌గౌడ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

దేవేందర్‌గౌడ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

11-05-2017

దేవేందర్‌గౌడ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

అమెరికాలో రాచెస్టర్‌లోని మేయో క్లినిక్‌లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న దేవేందర్‌గౌడ్‌ ఇటీవల రాచెస్టర్‌లోని మేయో క్లినిక్‌లో చేరారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆస్పత్రిని సందర్శించి దేవేందర్‌గౌడ్‌ను పరామర్శించారు. అనంతరం ఆయనకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.