టెక్నాలజీకి ప్రాధాన్యం: చంద్రబాబు

టెక్నాలజీకి ప్రాధాన్యం: చంద్రబాబు

12-05-2017

టెక్నాలజీకి ప్రాధాన్యం: చంద్రబాబు

అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షికాగో తెలుగు అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పనిలోనే ఆనందం పొందుతున్నందున నాకు విసుగులేదు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమైన రాష్ట్రంగా ఏపీ ఉండాలి. 2029 నాటికి దేశంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఏపీ ఉండాలన్నది లక్ష్యం. టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కాంగ్రెస్‌ పాలనలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయి. విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్రం కూడా సాయం అందిస్తోంది. గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేశాం. ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి రూ.145కే ఇంటర్నెట్‌, అన్ని ఛానళ్లు, టెలిఫోన్‌ సదుపాయం కల్పిస్తున్నాం’’ అని చంద్రబాబు వివరించారు.


Click here for Photogallery