షార్లెట్ లో నాటా మహిళా దినోత్సవ వేడుకలు

షార్లెట్ లో నాటా మహిళా దినోత్సవ వేడుకలు

14-05-2019

షార్లెట్ లో నాటా మహిళా దినోత్సవ వేడుకలు

నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (నాటా) మహిళా దినోత్సవ వేడుకలను షార్లెట్‌ నగరంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నాటా ప్రెసిడెంటు డాక్టర్‌ గోసల రాఘవ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. నాటా తలపెట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. 300పైగా మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సమీరా ఇళ్ళెందుల యాంకరింగ్‌ అందర్నీ ఆకట్టుకుంది. అనురాధా పన్నెం దర్శకత్వంలో ప్రదర్శించిన నాటిక అందరిని కడుపుబ్బ నవ్వించింది. సునీత సౌందరరాజన్‌ చేనేత వస్త్రాల ఫ్యాషన్‌ షో హుందాగా సాగింది. దుర్గా శైలజ దలిపర్తి, లావణ్యకోనురి ఆధ్వర్యంలో సాగిన నాట్య విన్యాసాలు అందరిని ఆనందపరిచాయి. 

'సాంస్క తిక వికాసమే నాటా మాట, సమాజ సేవయే నాటా బాట' ను ఆచరిస్తూ ఆటపాటలే ముఖ్యోద్దేశం కాకుండా సేవాతత్వంతో విరాళాలు సేకరించారు. షార్లెట్‌ లో స్వచ్చందంగా సేవలు అందించే లిల్లిపాడ్‌ హేవన్‌ అనే సంస్థకి ఆ విరాళాలు అందించారు. ఈ మహిళా దినోత్సవంలో పాలుపంచుకొన్న మహిళలందరూ నాటా కార్యవర్గానికి కతజ్ఞతలు తెలియజేశారని ప్రధాన కార్య నిర్వహణ అధికారి ఆళ్ళ రామిరెడ్డి  తెలిపారు.