ప్రవాసాంధ్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

ప్రవాసాంధ్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

16-05-2019

ప్రవాసాంధ్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

రాష్ట్రం కోసం మనం ధర్మపోరాటం చేశాం. ధర్మాన్ని మనం కాపాడాం, ఇప్పుడు ధర్మమే మనల్ని కాపాడుతోంది. కొంతమంది మనకు చెడు చేయాలని చూసినా ప్రకృతి కలిసివచ్చింది. మంచివారికి మంచే జరుగుతుంది, చెడు చేయాలన్నా మంచే అవుతుంది. జన్మభూమి-మావూరు, గ్రామ దర్శని-గ్రామ వికాసం, స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించారు. ఇంతకు రెట్టించిన స్ఫూర్తితో మరింతగా రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలి.

జన్మభూమి రుణం తీర్చుకోవాలి. స్వగ్రామం, స్వరాష్ట్రం, స్వదేశం అభివృద్దిలో భాగస్వాములు కావాలి. జన్మభూమి, కర్మభూమి రుణం తీర్చుకోలేనిది. ఎక్కడ పనిచేస్తున్నారో, ఆ దేశం(కర్మ భూమి) అభివృద్దికి దోహదపడాలి. ఆ దేశ జిడిపి వృద్దికి మీ ప్రతిభ, కష్టం తోడ్పడాలి. జెఈఈ మెయిన్స్ లో తొలి 4ర్యాంకులు రాష్ట్రానికే వచ్చాయి. తెలుగు విద్యార్ధుల ప్రతిభకు అదే నిదర్శనం.

నాలెడ్జ్ ఎకానమిలో మనదే పైచేయి కావాలి. ఇన్నోవేషన్ లో ఆంధ్రులదే పైచేయి కావాలి. ఏపి ఇన్నోవేషన్ హబ్ గా తయారు కావాలి. 100ర్యాంకుల్లో తొలి 25స్థానాలో మనవే కావాలి. నాలెడ్జ్ సొసైటిలో 25% వాటా మనదే కావాలి. పారిశ్రామిక వేత్తలుగా మీరంతా ఎదగాలి, పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలి. రాబోయే పది, పదిహేనేళ్లలో ప్రపంచంలోనే తెలుగుజాతి సాటిలేని మేటిగా రూపొందాలి.

ఎక్కడ అవకాశాలుంటే అక్కడ ఆంధ్రులను ప్రోత్సహించాలి. తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపచేయాలి. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ప్రతి పౌరుడు ఎదగాలి, ప్రతి ప్రవాసాంధ్రుడు రాణించాలి. రాష్ట్రంలో 2కోట్ల ఎకరాలకు నీళ్లిచ్చేవిధంగా జలవనరులు అభివృద్ది చేస్తాం. ఏపిలో వృద్దిరేటును 15%కు పెంపొందించాలి. పెట్టుబడి రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఆరోగ్యకర పంట ఉత్పత్తులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారుకావాలి.

పంచనదుల అనుసందానం చేస్తున్నాం.నీటిపారుదల ప్రాజెక్టులు 23పూర్తి చేశాం. రూ.67వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఖర్చు చేశాం. నీరు-ప్రగతి, జల సంరక్షణ ఉద్యమం చేపట్టాం. వీటన్నింటి వల్లే, 5ఏళ్లు వర్షాభావంలో కూడా సాగునీటి కొరత లేకుండా చేయగలిగాం. వ్యవసాయంలో వృద్ది తగ్గకుండా చూశాం. 9ఏళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐటిని ప్రోత్సహించాను. 300ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పాం. నాలెడ్జ్ ఎకానమిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేశాం. అందువల్లే రైతుబిడ్డలు ఇంజనీర్లుగా విదేశాల్లో స్థిరపడ్డారు. 

విభజన సమస్యలను పట్టుదలతో అధిగమిస్తున్నాం. 13జిల్లాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నాం. డిజిటల్ క్లాస్ రూమ్ లు అభివృద్ది చేశాం. రూ.5వేల కోట్లతో స్కూల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచాం.  పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాం. విదేశాలనుంచి పెట్టుబడులు రాబట్టాం, పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. 150దేశాల్లో 25లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భాగస్వాములు కావాలి. జన్మభూమి అభివృద్దికి చేయూత అందించాలి, సంఘీభావంగా నిలబడాలి. అప్పుడు జాబు కావాలంటే బాబు రావాలని అన్నారు, ప్రజలంతా ఆమోదించారు. ఇప్పుడు మళ్లీ నువ్వే రావాలి అన్నారు, ప్రజలంతా మీ వెంటే ఉన్నారు. మీరు చేసిన కష్టం, మీరు చూపిన చొరవ చాలా ఉపయోగపడింది.