టాంటెక్స్ మరియు నాట్స్ సంయుక్త ఆద్వర్యంలో డాల్లస్ లో ఘనంగా ముగిసిన మాతృదినోత్సవ వేడుకలు

టాంటెక్స్ మరియు నాట్స్ సంయుక్త ఆద్వర్యంలో డాల్లస్ లో ఘనంగా ముగిసిన మాతృదినోత్సవ వేడుకలు

16-05-2019

టాంటెక్స్ మరియు నాట్స్ సంయుక్త ఆద్వర్యంలో డాల్లస్ లో ఘనంగా ముగిసిన మాతృదినోత్సవ వేడుకలు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మరియు నాట్స్ సంయుక్తంగా మే 12న మినర్వా బాంక్వెట్ హాల్ లో ఏర్పాటు చేసిన “మాతృదినోత్సవ వేడుకలు”  అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన ఆట పాటలు, ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ 2019 అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఆధ్వర్యంలో వ్యాఖ్యాతలు వనం జ్యోతి, మద్దూరి సంధ్య మరియు కార్యక్రమ సమన్వయకర్త కృష్ణవేణి శీలం ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ప్రవాస భారతీయులు, మాతృమూర్తులు అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని మాతృదినోత్సవ వేడుకలను జయప్రదం చేసారు. ముందుగా కృష్ణవేణి శీలం అందరికి స్వాగతం పలికి, టాంటెక్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి సభకు వ్యాఖ్యాతలు వనం జ్యోతి, మద్దూరి సంధ్య లను పరిచయం చేశారు. చి. నిఖిత నన్నపనేని ప్రారంభ గీతం “కమ్మనైన అమ్మ” పాటతో ప్రారంభించి అందరి అభిమనాన్ని చూరగొన్నారు, తరువాత కల్పన ఉప్పలూరి శిష్య బృందం డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు.  వ్యాఖ్యాతలు వనం జ్యోతి, మద్దూరి సంధ్య లు అమ్మ, ఆప్యాయత, అనురాగం అనే అంశాలతో - ఇంటికి ఇల్లాలే దైవం అని, అందరికి కనిపించే దైవం అని, ఎన్ని వున్న అమ్మ ఆప్యాయతకు సరితూగవని అమ్మ గొప్పతనాన్ని కొనియాడారు.

చి. కీర్తి చామకూర, నిఖిత నన్నపనేని మరిన్ని అమ్మ పాటలతో అందరిని అలరించారు. Ms. గౌరి జున్నికర్ గారు మహిళలు తీసుకోవలసిన ఆరోగ్య పరమైన సలహాలు సూచనలు, Ms. శ్రీ తిన్ననూరి గారు సంపదలు సంబందించిన సూచనలు తెలియ జేశారు. Ms. శిల్ప ఖానోన్కర్ “సొగసు చూడతరమ” అనే శీర్షికన ఫ్యాషన్ షో నిర్వహించారు. ఫ్యాషన్ షో లో వ్యాఖ్యాత మద్దూరి సంధ్య మరియు ముఖ్యఅతిధిగా వచ్చిన సుందరాకాండ హీరోయిన్ అపర్ణ గారు కూడ పాల్గొనడం విశేషం. శ్రీలు మండిగ గారు నిర్వహించిన డ్యాన్సాక్షరి కార్యక్రమంలో విచ్చేసిన మహిళలు అందరు కొత్త డాన్స్ స్టెప్పులు వేస్తు సందడి చేశారు. మహిళలు అందరు కేక్ కట్ చేసి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.  ముఖ్యఅతిధి శ్రీమతి అపర్ణ గారు మాట్లాడుతు టాంటెక్స్ మరియు నాట్స్ వారికి దన్యవాదాలు తెలియ చేసి, తల్లిదనం తండ్రులు లేనిదే వుండదని మహిళలు చేపడుతున్న కార్యక్రమాలకి చేయూతనిస్తున్న తండ్రులు  అందరికి దన్యవాదాలు తెలియజేసి వారి భర్త, పిల్లలు  కూడ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా వుంది అన్నారు.

ముఖ్యఅతిధి శ్రీమతి అపర్ణ గారిని టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, తక్షణ పూర్వాధ్యక్షులు కృష్ణవేణి శీలం, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, శ్రీలు మండిగ, కళ్యాణి తాడిమేటి శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు.  టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ వీర్నపు చినసత్యం మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి  అందరికి కనిపించే దైవం అని, ఎన్ని వున్న అమ్మ ఆప్యాయతకు సరితూగవని అమ్మ గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మరియు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  వ్యాఖ్యాతలు వనం జ్యోతి, మద్దూరి సంధ్య లను టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ప్రసార మాధ్యమాలైన ​​ఫన్ ఏషియా, దేసిప్లాజ , టీవీ9​, టివి5 , మన టివి, టి.ఎన్.ఐ, తెలుగు టైమ్స్, ఐఏసియా లకు, డెకరేషన్ చేసిన "ఎపిక్ ఈవేంట్స్"కు, పసందైన భోజనం అందించిన బసేరా రెస్టారెంట్ వారికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేశారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

https://tantex.smugmug.com/2019-Events/Maitri-Events/TANTEX-Mothers-Day-Celebrations/

Click here for Event Gallery