హెచ్-1బీ వీసాలపై వేటేస్తారా ?

హెచ్-1బీ వీసాలపై వేటేస్తారా ?

16-05-2019

హెచ్-1బీ వీసాలపై వేటేస్తారా ?

భారతీయులను ఇబ్బందిపెట్టేలా అమలుచేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వలస విధానాల దూకుడుకు కళ్లెం పడింది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులను పెద్ద ఎత్తున ఎందుకు తిరస్కరిస్తున్నారు, వాటి జారీలో ఎందుంత జాప్యం చేస్తున్నారని ట్రంప్‌ ప్రభుత్వాన్ని డిస్ట్రిక్ట్‌ కోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని వలస విధాన విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఇటీ సేవల కంపెనీల ప్రయోజనాలను దెబ్బతీసేలా వలస విధానాల్లో మార్పులుచేర్పులు చేస్తున్నారనే ఆరోపణలపై స్పందించాలని ఆ ఉత్తర్వుల్లో కోరింది. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు వెళ్లేవారిలో భారతీయులే ఎక్కువ. కోర్టు నిర్ణయం వారికి గొప్ప ఊరటనిచ్చి, డాలర్‌ కలలను సజీవంగా నిలిచింది. అమెరికాలోని ఐటీ కంపెనీల సమాఖ్య అయిన ఐటీ సర్వ్‌ అలియెన్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

అయితే, గత ఏడాది సెప్టెంబరు 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి హెచ్‌-1బీ వీసాల తిరస్కరణ శాతం 20 నుంచి ఒక్కసారిగా 80 శాతానికి పెరిగిపోయిందని, అదనపు సమాచారం కావాలంటూ మరో 60 శాతం దరఖాస్తులను పక్కన పెట్టారని ఈ కంపెనీలు ఫిర్యాదు చేశాయి. అదే సమయంలో సర్వీసుయేతర కంపెనీలు చేసే దరఖాస్తుల్లో కేవలం ఒక్క శాతమే నిరాకరించారని తెలిపాయి. ఐటీ సేవల కంపెనీలపై ప్రభుత్వ వివక్షపూరిత వైఖరికి ఇదే నిదర్శనమని వాదించారు. హెచ్‌-1బీ వీసాల విధానంలో తీసుకొచ్చిన సవరణలు.. తమ సంస్థల ప్రయోజనాలను భంగకరంగా మారయని, వాటిని సండలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.