హువేపై అమెరికా నిషేధం

హువేపై అమెరికా నిషేధం

17-05-2019

హువేపై అమెరికా నిషేధం

అమెరికన్‌ టెలికాం కంపెనీలపై జరుగుతున్న దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రంగంలోకి దిగారు. చైనా కంపెనీ హువేపై నిషేధం వేటు వేశారు. టెలికాం కంపెనీలపై విదేశీ కంపెనీల దాడిని తిప్పి కొట్టేందుకు జాతీయ ఆర్థిక ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. దీని వల్ల విదేశీ కంపెనీల టెక్నాలజీ, సేవలు అమెరికన్‌ కంపెనీలు కొనుగోలు చేయడాన్ని నిషేధించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే ఏయే దేశాలు, కంపెనీలకు ఇది వర్తిస్తుందన్నది ప్రత్యేకంగా ప్రనస్తావించలేదు. అయితే అధికారులు ఇప్పటికే జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తున్న హువే నుంచి 5 జీ టెక్నాలజీలు కొనుగొలు చేయవద్దని టెలికాం కంపెనీలకు సూచించారు. ఈ ఉత్తర్వు వెలువడిన కొంత సమయంలోనే బ్యూరో ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ సెక్యూరిటీ ఒక ఉత్తర్వు జారీ చేస్తూ హువేను ఎంటిటీ లిస్ట్‌లో చేర్చుతున్నట్టు ప్రకటించింది. పరికరాలు కొనుగోలు చేయాలన్నా ఎగుమతులు చేయాలన్నా సాంకేతిక పరిజ్ఞానాల బదిలీ కోసమైనా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవలసిన కంపెనీల జాబితానే ఎంటిటీ లిస్ట్‌గా వ్యవహరిస్తారు.