2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా

2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా

17-05-2019

2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని గద్దెదింపడమే తన లక్ష్యమని డెమోక్రటిక్‌ పార్టీ నేత, న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌డె బ్లాసియో తెలిపారు. వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. నా స్వస్థలం న్యూయార్క్‌. నా రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలైంది. ట్రంప్‌తో తలపడే సత్తా నాలో ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. మీ అందరి సహకారం ఉంటే కచ్చితంగా ట్రంప్‌పై గెలుస్తాను. నా తొలి ప్రచారం లోవా, దక్షిణ కరోలినా నగరాల నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను అని బిల్‌డె బ్లాసియో అన్నారు.