వారు ఇంగ్లిసు నేర్చుకోవాల్సిందే : ట్రంప్

వారు ఇంగ్లిసు నేర్చుకోవాల్సిందే : ట్రంప్

17-05-2019

వారు ఇంగ్లిసు నేర్చుకోవాల్సిందే : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నూతన వలస విధానాన్ని ఆవిష్కరించారు. అమెరికాకు వలస వెళ్లాలనుకునే వారెవరైనా ఇకపై ఇంగ్లిషు నేర్చుకోవాల్సిందేనన్నారు. అంతేకాదు అమెరికా చరిత్ర, సమాజం గురించి ప్రాథమిక వాస్తవాలను కూడా తెలుసుకోవాలి. అమెరికా వలస విధానాన్ని తిరగరాసి కొత్త రూపు ఇచ్చేందుకు ఉద్దేశించిన సంస్కరణల ప్రతిపాదనల్లో ఈ అంశాలను పొందుపరిచినట్టు ట్రంప్‌ ప్రకటించారు. అడ్మిషన్‌కు ముందు దరఖాస్తుదారులు పౌరశాస్త్ర (సివిక్స్‌) పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా స్కిల్డ్‌ వర్కర్ల కోటా పెరిగేలా ప్రతిపాదనలు రూపొందించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వర్కర్ల వలసను 12 నుంచి 57 శాతానికి పెంచడం తాము చేస్తున్న పెద్ద మార్పు అని ట్రంప్‌ తెలిపారు. ఈ కోటాను కూడా పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. అయితే వీరంతా ప్రతిభ, నైపుణ్యం ఆధారంగానే రావలసి ఉంటుందని వైట్‌హౌస్‌లో ఆయన వివరించారు.