రష్యన్లపై అమెరికా ఆంక్షలు

రష్యన్లపై అమెరికా ఆంక్షలు

18-05-2019

రష్యన్లపై అమెరికా ఆంక్షలు

రష్యాకు చెందిన ఐదుగురు వ్యక్తులు, ఒక సంస్థపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రముఖ ప్రతిపక్ష నేత హత్యతో సహా అనేక అభియోగాలు మోపుతూ అమెరికా ఈ ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలను గాడిన పెట్టేందుకు జరిగిన చర్చలు ముగిసిన మరునాడే అమెరికా ఆంక్షలు విధించటం గమనార్హం. కొత్త చట్టం ప్రకారం 2009లో అవినీతి నిరోధకశాఖకు చెందిన ఒక అధికారి సెర్జీ మాగ్నెట్‌స్కీ మృతి కేసుకు సంబంధించి ఆంక్షలను గురైన ఈ ఐదుగురు వ్యక్తులను అమెరికాలో వున్న ఆస్తునలు స్తంభింప చేయటంతో పాటు వారు అమెరికాలో పర్యటించకుండా నిషేధం విధిస్తారు. అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో వుంచిన వ్యక్తుల్లో రష్యా హోంశాఖ అధికారి రుల్సన్‌ జెరిమ్వేవ్‌, ఎలీనా అనతోలీన్నా ట్రికుల్యా, గెన్నడీ వ్చాచస్లోవించ్‌కర్లోవ్‌ అనే ఇద్దరు దర్యాప్తు అధికారులు కూడా వున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో రష్యన్‌ రిసార్ట్‌ శోచిలో భేటీ అయిన రెండు రోజులే ఈ ఆంక్షలు జారీ కావటం విశేషం.