ఆ దేశంతో యుద్ధం కోరుకోవడం లేదు : ట్రంప్

ఆ దేశంతో యుద్ధం కోరుకోవడం లేదు : ట్రంప్

18-05-2019

ఆ దేశంతో యుద్ధం కోరుకోవడం లేదు : ట్రంప్

ఇరాన్‌తో తాము యుద్ధం కోరు కోవడంలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఇరాన్‌పై ఆంక్షలు మోపిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్త్రిక్త వాతావరణం చోటుచేసుకున్న విషయం నిజమేనని అన్నారు. ఇరాన్‌ సరిహద్దులో అమెరికా యుద్ధనౌకలను మోహరించడమే కాకుండా, ఇరాక్‌లో పనిచేస్తున్న ఎంబసీ సిబ్బందిని వెనక్కి వచ్చేయాలని ట్రంప్‌ ఆదేశించారు. ఇరాన్‌, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని యూస్‌ మిత్రదేశాలు సైతం చెబుతున్నాయి. ఈ విషయమై వైట్‌హౌస్‌ అధికారులతో ట్రంప్‌ భేటీ అయ్యారు. ఇరాన్‌తో అమెరికా యుద్ధం కోరుకోవడంలేదని సృష్టతనిచ్చారు. ఉగ్రసంస్థలకు ఇరాన్‌ నుంచి ఆయుధాలు, విరాళాలు అందుతున్నాయని ఆరోపించారు. ఉగ్రసంస్థలను పెంచిపోషిస్తున్న ఇరాన్‌ వైఖరి నచ్చకపోవడంతోనే అణు ఒప్పందం నుంచి వైదొలిగామని అన్నారు. అంతేగాకుండా, క్షిపణులతో నింపివున్న ఓడలను పర్షియన్‌ గల్ఫ్‌ జలాల్లో ఇరాన్‌ మోహరించిందని తాము విశ్వసిస్తున్నామని ట్రంప్‌ ఆరోపించారు.