ఔను.. మా సాఫ్ట్‌వేర్‌లో లోపం ఉంది

ఔను.. మా సాఫ్ట్‌వేర్‌లో లోపం ఉంది

20-05-2019

ఔను.. మా సాఫ్ట్‌వేర్‌లో లోపం ఉంది

అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌ ఎట్టకేలకు తన తప్పు ఒప్పుకొంది. పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానం అనుకరణ యంత్రం (సిమ్యులేటర్‌) సాఫ్ట్‌వేర్‌లో లోపం ఉన్నమాట వాస్తమేనని అంగీకరించింది. సాఫ్ట్‌వేర్‌లో చేసిన దిద్దుబాటు గురించి ఆపరేటర్లకు కూడా వెల్లడించామని తెలిపింది.