అమెరికాలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు

అమెరికాలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు

20-05-2019

అమెరికాలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రజలు చిరునవ్వులతో జీవిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నారై అమెరికాశాఖ ఆధ్వర్యంలో ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపాసిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడుతూ వచ్చే రెండు సంవత్సరాల్లో రైతులు పడే కష్టాలు పోయి వారి కండ్లల్లో సంతోషాన్ని చూస్తామన్నారు. ఒకప్పుడు దేశంలో అభివృద్ధి అంటే బెంగాల్‌ అని.. దేశానికి మోడల్‌ కేరళ అని అనుకునేవారు.. ఇప్పుడు దేశానికి రోల్‌ మోడల్‌ తెలంగాణ అని దేశ నలుమూలల్లో వినిపిస్తున్నదని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఆకుపచ్చ తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని, వ్వవసాయ రంగమే కాదు, విద్య, వైద్యం, విద్యుత్‌ ఇలా అన్ని రంగాల్లో ప్రగతిసాధించే దిశగా ప్రభుత్వం ముందుకుపోతున్నదని చెప్పారు. నాటి ఉద్యమంలో నేటి అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కీలకం అన్నారు. ఆత్మీయ సమ్మేళానానికి వచ్చిన హరీశ్‌రావుకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం మహిళలు బొట్టుపెట్టి, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు.