ఫ్లైట్ బుకింగ్ సేవలు ప్రారంభించిన అమెజాన్

ఫ్లైట్ బుకింగ్ సేవలు ప్రారంభించిన అమెజాన్

20-05-2019

ఫ్లైట్ బుకింగ్ సేవలు ప్రారంభించిన అమెజాన్

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ సరికొత్త సేవలను భారత్‌తో ప్రారంభించింది. ఇకనుంచి అమెజాన్‌ దేశీయ విమాన టికెట్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇప్పటికే షాపింగ్‌, నగదు బదలాయింపు, బిల్లుల చెల్లింపు, మొబైల్‌ రీచార్జి వంటి సేవలను అమెజాన్‌ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా దీనిలో బుక్‌ చేసుకున్న టికెట్లను దర్దు చేస్తే ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని అమెజాన్‌ తెలిపింది. కేవలం విమానయాన సంస్థ విధించే పెనాల్టీలను మాత్రం చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. సరికొత్త సేవలను క్లియర్‌ ట్రిప్‌ సంస్థతో కలిసి అమెజాన్‌ యాప్‌లో ప్రారంభించారు. మేము క్లియర్‌ ట్రిప్‌ సంస్థతో కలిసి పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నాం. మా కస్టమర్లకు అత్యున్నత స్థాయి సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెజాన్‌ యాప్‌ వినియోగాదారులకు, ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్న వారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అమెజాన్‌ పే డైరెక్టర్‌ షరీక్‌ తెలిపారు.