యుద్దం చేయాలని భావిస్తే.. అదే ఆ దేశానికి ఆఖరి రోజు

యుద్దం చేయాలని భావిస్తే.. అదే ఆ దేశానికి ఆఖరి రోజు

21-05-2019

యుద్దం చేయాలని భావిస్తే.. అదే ఆ దేశానికి ఆఖరి రోజు

తమ దేశ ప్రయోజనాలపై ఇరాన్‌ దాడి చేస్తే దానికి అదే చివరి రోజవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. తమతో యుద్ధానికి దిగితే ఇరాన్‌ చరిత్ర ముగుస్తుందని ట్విట్‌ చేశారు. ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ గట్టిగా తిప్పికొట్టింది. యుద్ధం జరిగే ఇరాన్‌కు ముగింపు పలుకడం కాదని, జాతుల నిర్మూలన యత్నాలకు పాల్పడుతున్న ట్రంప్‌తో ఆలోచనలకు చరమగీతం పాడుతామని ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి మహమ్మద్‌ జాపద్‌ జరీఫ్‌  పేర్కొన్నారు. గల్ఫ్‌లో బీ-52 బాంబర్లు, యుద్ధ విమానాలను అమెరికా మోహరించడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.