భారత పోలీస్ అధికారికి ఐరాస పురస్కారం

భారత పోలీస్ అధికారికి ఐరాస పురస్కారం

22-05-2019

భారత పోలీస్ అధికారికి ఐరాస పురస్కారం

శాంతి పరిరక్షణలో అసువులు బాసిన భారతదేశ పోలీసు అధికారి జితేందర్‌ కుమార్‌కు ఐక్యరాజ్యసమితి హామర్‌షల్డ్‌ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. అంతర్జాతీయ శాంతిస్థాపకుల దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో భారత శాశ్వత ప్రతినిధి ఈ పురస్కారాన్ని అందుకుంటారు. కాంగో దేశంలో సేవలు అందిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన మొత్తం 119 మంది మిలటరీ, పోలీసు అధికారులకు ఐరాస ఈ పురస్కారాన్ని అందజేయనుంది.