మా బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు

మా బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు

22-05-2019

మా బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ హువావే అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా, చైనా దేశాలకు మధ్య వాణిజ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో హార్డ్‌వేర్‌, ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నట్టు అమెరికా దిగ్గజ ఇంటర్నెట్‌ సంస్థ గూగుల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై హువావే వ్యవస్థాపకుడు రెన్‌ జెంగ్‌ఫీ ఘాటుగా స్పందించారు. తమ బలాన్ని అమెరికా తక్కువ అంచనా వేస్తోందంటూ హెచ్చరించారు. చైనా మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. మా బలాన్ని తక్కువ అంచనా వేసి అమెరికా రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని అన్నారు.