హువావేవై గూగుల్ నిర్ణయం వెనక్కి

హువావేవై గూగుల్ నిర్ణయం వెనక్కి

22-05-2019

హువావేవై గూగుల్ నిర్ణయం వెనక్కి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు చెందిన హువావేపై నిషేధం విధించడంతో ఇతర సంస్థలు ఒక్కొక్కటిగా ఆ సంస్థతో సంబంధాలను తెంచుకుంటున్నాయి. తాజాగా గూగుల్‌కు చెందిన మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ హువావేకు తెగదెంపులు చేసుకుంది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లతో సహా ఇతర ఏ సాంకేతిక సహకారం హువావేకు అందించబోమని అల్ఫాబెట్‌ ప్రకటించింది. కానీ 90 రోజుల పాటు హువావేకు సడలింపు ఇస్తున్నట్టు వౌట్‌హౌస్‌ ప్రకటన చేయడంతో గూగుల్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రసుత్తం హువావే మొబైల్స్‌ వినియోగిస్తున్న వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా గూగుల్‌ యాప్స్‌ను వినియోగించుకోవచ్చని, ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, యాప్‌లకు సంబంధించి కొత్త అప్‌డేట్స్‌ను కూడా హువావే వినియోగదారులు యథావిధిగా అందిస్తామని గూగుల్‌ తెలిపింది.