చంద్రబాబును కలిసిన జయరామ్‌ కోమటి

చంద్రబాబును కలిసిన జయరామ్‌ కోమటి

24-05-2019

చంద్రబాబును కలిసిన జయరామ్‌ కోమటి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఎన్నారై టీడిపి నాయకుడు, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించిన జయరామ్‌ కోమటి కలుసుకున్నారు. ఈ సందర్భంగా జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, తమ మద్దతు ఎల్లప్పుడూ మీకు ఉంటుందని చెప్పారు.

ప్రజల తీర్పును తాము శిరసావహిస్తున్నామని అంటూ, తాను అమెరికాలో ఎపి ఫ్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించిప్పుడు తనకు సహకరించిన అధికారులకు, ఎన్నారైలకు ఇతరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పాలన చేయగలరన్న నమ్మకాన్ని జయరామ్‌ కోమటి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ మేలుకోరే ఎన్నారైగా తాను ఎల్లప్పుడూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటానని చెప్పారు.