త్వరలో డొనాల్డ్ ట్రంప్, మోదీల భేటీ

త్వరలో డొనాల్డ్ ట్రంప్, మోదీల భేటీ

25-05-2019

త్వరలో డొనాల్డ్ ట్రంప్, మోదీల భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో జపాన్‌లో జరుగనున్న జి-20 దేశాల సదస్సు సందర్భంగా భేటీ కానున్నారు. భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవటంపై వారు చర్చించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోదీని అభినందించేందుకు ట్రంప్‌ ఫోన్‌ చేశారని, ఈ సందర్భంగా జపాన్‌లోని ఒసాకా నగరంలో సమావేశం కావటంపై వారిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారని శ్వేతసౌధం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.