గూగుల్‌ డుయోలో సరికొత్త ఫీచర్‌

గూగుల్‌ డుయోలో సరికొత్త ఫీచర్‌

25-05-2019

గూగుల్‌ డుయోలో సరికొత్త ఫీచర్‌

గూగుల్‌ సంస్థకు చెందిన ప్రముఖ వీడియో కాలింగ్‌ యాప్‌ డుయో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ ముగ్గురు లేదా నలుగురితో గ్రూప్‌ వీడియో చాట్‌ చేసుకునే వెసులుబాటు ఉండగా, దీన్ని మరింత పెంచింది. ఇక నుంచి ఏకకాలంలో 8 మంది గ్రూప్‌ మీడియో చాట్‌ చేసుకొనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు అధికారిక బ్లాగ్‌లో గూగుల్‌ డుయో ప్రకటించింది. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో అందుబాటులోకి వచ్చిందని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వీడియో కాల్స్‌ చేసేటప్పుడు డేటాను ఆదా చేయడం కోసం డేటా సేవింగ్‌ మోడ్‌ను ప్రవేశపెట్టింది. వీడియోకాల్‌లో ఉన్నప్పుడు టెక్ట్స్‌, ఇమోజీ లేదా డూడుల్‌ను పంపించే వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌లో కేవలం ముగ్గురితో మాత్రమే ఏకకాలంలో వీడియో చాట్‌ చేసే అవకాశం ఉంది.