దేశ ప్రతిష్ట పెంచిన ప్రవాసీయులు : ప్రధాని

దేశ ప్రతిష్ట పెంచిన ప్రవాసీయులు : ప్రధాని

10-06-2019

దేశ ప్రతిష్ట పెంచిన ప్రవాసీయులు  : ప్రధాని

విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు గత ఐదేళ్ళుగా తమ శక్తి, కృషితో దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు విస్తరింపజేశారని, ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాల్దీవుల్లో పర్యటించి, ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌తో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ప్రధాని మోదీ నేరుగా శ్రీలంకకు చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని ఆహ్వానం మేరకు మోదీ వెళ్ళారు. ఇలా ఉండగా కొలంబోలో ఏర్పాటైన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ విదేశాల్లో ఉన్న భారతీయుల కృషి, సహకారం వల్ల ఆయా దేశాలు ప్రగతిని సాధిస్తున్నాయని, ఫలితంగా భారత్‌కూ మంచి పేరు వస్తున్నదని అన్నారు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ భారతీయులు ఉన్నారని, భారతీయులు కష్టపడి పని చేస్తారన్న ప్రశంసే తప్ప ఏ ఒక్క చిన్న ఫిర్యాదు కూడా రాదన్న ధీమాను మోదీ వ్యక్తం చేశారు.