పండ్లు, కూరగాయలతో గుండె జబ్బుకు చెక్!

పండ్లు, కూరగాయలతో గుండె జబ్బుకు చెక్!

10-06-2019

పండ్లు, కూరగాయలతో గుండె జబ్బుకు చెక్!

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మనం రోజూ తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు తగినన్ని లేకపోతే గుండె జబ్బులు, టైప్‌-2 మధుమేహం సంభవించే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఆ వివరాలను న్యూట్రిషన్‌ 2019లో వెల్లడించారు. ఆహారంలో తగినన్ని పండ్లు అందక ప్రతి ఏడుగురిలో ఒకరు గుండె జబ్బుల బారినపడి చనిపోతుంటే.. కూరగాయలు సమృద్ధిగా లేక ప్రతి 12మందిలో ఒకరు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం 60శాతం తగ్గుతుందన్నారు.