అమెరికాలో నిషేధం ఉన్నా... హువావీ దూకుడు

అమెరికాలో నిషేధం ఉన్నా... హువావీ దూకుడు

10-06-2019

అమెరికాలో నిషేధం ఉన్నా... హువావీ దూకుడు

హువావీ 5జీ సేవల వినియోగంపై అమెరికా నిషేధం ఉన్నా.. ప్రపంచ మార్కెట్‌లో దాని ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు. అంతర్జాతీయ 5జీ టెలీకమ్యూనికేషన్స్‌ వ్వవస్థలో ఈ చైనా టెలికాం దిగ్గజం దూసుకెళ్తున్నది మరి. ఇప్పటిదాకా 30 దేశాల్లో వాణిజ్యపరంగా 46 5జీ కాంట్రాక్టులను పొందినట్లు హువావీ వెల్లడించింది. హువావీ చైనా ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసే సంస్థని, ఇతర దేశాలపై గూఢచార్యం చేస్తున్నదని ఆరోపిస్తూ ఈ సంస్థపై ట్రంప్‌ సర్కార్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గ్లోబల్‌ మార్కెట్‌లో హువావీ సంగతి అయిపోయిందని అంతా భావించిన నేపథ్యంలో... ఆ అంచనాలను తలదన్నేలా హువావీ పరుగులు తీస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ఈ క్రమంలోనే గూగుల్‌ సైతం హువావీ నిషేధం పట్ల అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. హువావీ ఫోన్లకు గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆప్లికేషన్లు దూరం కానున్న సంగతి విదితమే. దీంతో హువావీ జోరు చూస్తుంటే ఆప్లికేషన్ల మార్కెట్‌లో తమ ఏకఛత్రాధిపత్యానికి త్వరలోనే బ్రేకులు పడవచ్చన్న భయం ఇప్పుడు గూగుల్‌లో కనిపిస్తున్నది. కాగా, హువావీపై అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తప్పుబట్టినది తెలిసిందే.