తానా కాన్ఫరెన్స్ పనులు ముమ్మరం

తానా కాన్ఫరెన్స్ పనులు ముమ్మరం

11-06-2019

తానా కాన్ఫరెన్స్ పనులు ముమ్మరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలను వాషింగ్టన్‌ డీసీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోవైపు కాన్ఫరెన్స్‌ను గతంలో కన్నా విభిన్నంగా, ప్రత్యేకంగా ఉండేలా కార్యక్రమాలు, ఏర్పాట్లు ఉండాలని అధ్యక్షుడు సతీష్‌ వేమన భావిస్తున్నారు. అందుకోసం కాన్ఫరెన్స్‌ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా డా. నరేన్‌ కొడాలి, కాన్ఫరెన్స్‌ కో ఆర్డినేటర్‌గా డా. వెంకటరావు మూల్పూరిని నియమించారు. ఆపరేటింగ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సతీష్‌ వేమనతోపాటు డా. నరేన్‌ కొడాలి, డా. వెంకటరావు మూల్పూరి, రవి గౌరినేని, రమాకాంత్‌ కోయ, రఘు దీప్‌ మేక, అనిల్‌ చౌదరి ఉప్పులపాటి, రవి పొట్లూరి ఉన్నారు. అడ్వయిజరీ కమిటీలో డా. హేమప్రసాద్‌ యడ్ల (చైర్‌), గంగాధర్‌ నాదెళ్ళ, జయరామ్‌ కోమటి, జంపాల చౌదరి, కృష్ణ ప్రసాద్‌ కాట్రగడ్డ ఉన్నారు.

కాన్ఫరెన్స్‌ ట్రెజరర్‌గా నాగ్‌ నెల్లూరి, సెక్రటరీగా జనార్దన్‌ నిమ్మలపూడి వ్యవహరిస్తున్నారు. కాన్ఫరెన్స్‌ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ కమిటీలకు పలువురు నాయకత్వం?వహిస్తున్నారు. అగ్రికల్చరల్‌ ఫోరంకు డా. జానయ్య కోట, అలూమ్ని కమిటీకి సతీష్‌ దివిచెంచు, ఆడియో విజువల్‌ స్టేజ్‌ కమిటీకి అవినాష్‌ కాసా, అవార్డ్‌ కమిటీకి రామకృష్ణ బొబ్బ నాయకత్వం వహిస్తున్నారు. బాంక్వెట్‌ కమిటీకి చంద్రకుమార్‌ మాలావతు, బిజినెస్‌ ఫోరంకు గౌతం?అమర్నేని, సెలబ్రిటీస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీకి ఉజ్వల్‌ కస్టల, సిఎంఇ కమిటీకి డా. నవీన హేమంత్‌, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కమిటీకి శ్రీనివాస్‌ మిక్కిలినేని, కార్పొరేట్‌ స్పాన్సర్స్‌ కమిటీ చైర్‌గా జగదీష్‌ ప్రభల, కల్చరల్‌ కమిటీ చైర్‌గా రవి గౌరినేని, క్యూరీ-తానా కమిటీ చైర్‌గా గౌరి వేమూరి, డెకొరేషన్స్‌ కమిటీ చైర్‌గా రామకృష్ణ బొల్లు, ధీమ్‌తానా కమిటీ చైర్‌గా సాయిసుధ పాలడుగు, డోనర్‌ రిలేషన్స్‌ కమిటీ చైర్‌గా ఎన్‌ఆర్‌సి నాయుడు, ఎగ్జిబిట్స్‌ కమర్షియల్‌ కమిటీ చైర్‌గా సత్యవర్థన్‌ సూరపనేని, ఫైనాన్స్‌ కమిటీ చైర్‌గా మోహన్‌ వెనిగళ్ళ, ఫుడ్‌ కమిటీ చైర్‌గా చంద్రమోహన్‌ బెవర, ఫండ్‌ రైజింగ్‌ కమిటీ చైర్‌గా రవి మందలపు, గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ కమిటీ చైర్‌గా రాజేష్‌ కాసరనేని, హాస్పిటాలిటీ అండ్‌ గెస్ట్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ చైర్‌గా రాము జక్కంపూడి, హోస్ట్‌ కమిటీ - జిడబ్ల్యుటీసిఎస్‌ చైర్‌గా సత్యనారాయణ మన్నె, హోటల్స్‌ కమిటీ చైర్‌గా సుధీర్‌ కొమ్మి, ఇనాగురల్‌ కమిటీ చైర్‌గా సాయికాంత రాపర్ల, ఇండియా కో ఆర్డినేషన్‌ వ్యవహారాలను ప్రసాద్‌ గారపాటి, సుబ్బారావు చెన్నూరి చూస్తున్నారు.

ఇన్విటేషన్స్‌ వ్యవహారాల కమిటీ చైర్‌గా గౌతం యలమంచిలి, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిటీ చైర్‌గా త్రిలోక్‌ కంతేటి, లిటరరీ కమిటీ చైర్‌గా భూపతి విహారి దొనిపర్తి, మెట్రిమోనియల్‌ కమిటీ చైర్‌గా లక్ష్మీ దేవినేని, మీడియా వ్యవహారాల కమిటీ చైర్‌గా భాను మాగులూరి, మొబైల్‌ అండ్‌ వెబ్‌ కమిటీ చైర్‌గా సతీష్‌ వరికుటి, పాఠశాల-తానా కమిటీ చైర్‌గా అశోక్‌బాబు కొల్లా, ప్యానెల్‌ డిస్కషన్స్‌ కమిటీ చైర్‌గా డా. రమేష్‌ రావెళ్ళ, పొలిటికల్‌ ఫోరం?ఇండియా కమిటీ చైర్‌గా డా. గోరంట్ల వాసుబాబు, పొలిటికల్‌ ఫోరం యుఎస్‌ కమిటీ చైర్‌గా ప్రసాద్‌ అడప, ప్రోగ్రామ్‌ అండ్‌ ఈవెంట్స్‌ కమిటీ చైర్‌గా వేణుగోపాల్‌ జంగ, పబ్లిసిటీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ కమిటీ చైర్‌గా కార్తీక్‌ కోమటి, రిసెప్షన్‌ కమిటీ చైర్‌గా బిందు ఆచంట, రిజిస్ట్రేషన్‌ కమిటీ చైర్‌గా కృష్ణ లాం, రిలీజియస్‌ అండ్‌ స్ప్రిట్చువల్‌ కమిటీ చైర్‌గా సుబ్రహ్మణ్యం?వారణాసి, సెక్యూరిటీ కమిటీ చైర్‌గా అశోక్‌ దేవినేని, సోషల్‌ మీడియా కమిటీ చైర్‌గా యాష్‌ బొద్దులూరి, సావనీర్‌ కమిటీ చైర్‌గా తనూజ గుడిసేవ, స్టార్ట్‌ అప్‌ క్యూబ్‌ కమిటీ చైర్‌గా సతీష్‌ తుమ్మల, ట్రాన్స్‌పోర్టేషన్‌ కమిటీ చైర్‌గా సతీష్‌ చింత, ట్రావెల్‌ డెస్క్‌ కమిటీ చైర్‌గా సురేష్‌ మారెళ్ళ, యుఎస్‌ పొలిటికల్‌ ఇన్విటేషన్స్‌ కమిటీ చైర్‌గా అంజన్‌ చిమలదిన్నె, వెన్యూ కమిటీ చైర్‌గా సుశాంత్‌ మన్నె, వలంటీర్‌ కమిటీ చైర్‌గా ప్రదీప్‌ నుగూరు, ఉమెన్స్‌ ఫోరం కమిటీ చైర్‌గా శ్రీలేఖ రెడ్డి పల్లె, శ్రీలక్ష్మీ చాపరాల, యూత్‌ ఫోరం కమిటీ చైర్‌గా రవి అడుసుమిల్లి పనిచేస్తున్నారు.

తానా కళ్యాణమస్తు

తానా మహాసభల్లో పెళ్లికాని యువతీ యువకులకోసం 'కళ్యాణమస్తు' పేరుతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక మెట్రిమోనీ డాట్‌ కమ్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని తానా నిర్వహిస్తోంది. తమ పేర్లను వెంటనే నమోదు చేసుకోవాలని మేట్రిమోనీ కమిటీ కోరింది. ఇతర వివరాలకు తానా కాన్ఫరెన్స్‌ వెబ్‌సైట్‌ను చూడండి.

www.tana2019.org