విశాఖ వచ్చిన అమెరికా నౌక

విశాఖ వచ్చిన అమెరికా నౌక

12-06-2019

విశాఖ వచ్చిన అమెరికా నౌక

అమెరికా నౌకాదళానికి చెందిన జేపీ ముర్తా నౌక నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం తీరానికి చేరుకుంది. విశాఖ పోర్టులోని ఓర్‌ బెర్త్‌కి చేరుకున్న నౌకకు భారత నౌకాదళం సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక బ్యాండుతో స్వాగతం పలికింది. నౌకలో విశాఖకు చేరుకున్న అధికారులు, సిబ్బంది ఇక్కడ ప్రజలతో సామాజికపరంగా మమేకం అవుతారని నేవీ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మద్య సాగర భద్రత, రక్షణ అంశాల బలోపేతానికి ఈ పర్యటన ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని పేర్కొన్నాయి. ఈ నెల 14న నౌక తిరుగుపయనం అవుతుందని, భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ రణవిజయ్‌తో కలిసి ముర్తా విన్యాసాల్లో పాల్గొంటుందని ఆ వర్గాలు వివరించాయి.