గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్!

గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్!

12-06-2019

గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్!

ప్రయాణికులు, చోదకులకు తోడ్పడేలా గూగుల్‌ మ్యాప్స్‌ లో సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. వాహనం దారి తప్పితే వెంటనే హెచ్చరించే వ్యవస్థను టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఆఫ్‌-రూట్‌ అలర్ట్స్‌గా పిలిచే ఈ ఫీచర్‌.. స్టే సేఫర్‌ మెనూలో కనిపిస్తుంది. వినియోగదారులు గమ్యాన్ని ఎంచుకున్నాక, ప్రయాణం ప్రారంభానికి ముందు సదరు మెనూ అందుబాటులోకి వస్తుంది. వెళ్లాల్సిన మార్గం నుంచి వాహనం 500 మీటర్ల మేర దారి తప్పితే వెంటనే వినియోగదారుల చరవాణులకు హెచ్చరికలు పంపడం ఆఫ్‌-రూట్‌ అలర్ట్స్‌ ప్రత్యేకత. వినియోగదారుల భద్రతకు, కొత్త ప్రాంతాల్లో కారు డ్రైవర్ల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఈ హెచ్చరిక వ్యవస్థ దోహదపడనుంది.