సమ్మర్ సేల్ ఆపర్ ను ప్రకటించిన ఇండిగో

సమ్మర్ సేల్ ఆపర్ ను ప్రకటించిన ఇండిగో

12-06-2019

సమ్మర్ సేల్ ఆపర్ ను ప్రకటించిన ఇండిగో

చౌక విమానయాన సేవలందించే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పెషల్‌ సమ్మర్‌ సేల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. నాలుగు రోజుల పాటు (ఈనెల 11 నుంచి 14 వరకు) కొనసాగనున్న ఈ పథకంలో భాగంగా దేశీయ మార్గాల్లో విమానయాన టికెట్‌ ప్రారంభ ధరను రూ.999గా (అన్ని పనులు కలిపి) నిర్ణయించింది. అంతర్జాతీయ మార్గాల్లో టికెట్లను రూ.3,499కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా ఈనెల 16 నుంచి సెప్టెంబరు 28 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని ఎయిర్‌ లైన్స్‌ సృష్టం చేసింది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో దాదాపు 50 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది.