తెలంగాణ సంస్కృతిని అమెరికాలో విస్తరిస్తాం : ఆటా

తెలంగాణ సంస్కృతిని అమెరికాలో విస్తరిస్తాం : ఆటా

12-06-2019

తెలంగాణ సంస్కృతిని అమెరికాలో విస్తరిస్తాం : ఆటా

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించి విశ్వవ్యాప్తం చేసేందుకు కృషిచేస్తానని అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ (ఆటా) నూతన అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ కునూర్‌ తెలిపారు. ఆటా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం  హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంగీత సాహిత్య కళారంగాల్లో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ప్రోత్సాహక ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు పలుకుతూ అమెరికాలో అంతర్జాతీయ వేడుకల్లో ఇక్కడి కళాకారులు, సాహితీవేత్తలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మహిళా సాధికారతకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఆటా కోశాధికారి రామచంద్రారెడ్డి ఆది, భారత సమన్వయకర్తలు డాక్టర్‌ పద్మజారెడ్డి,  రామచంద్రారెడ్డి బాణాపురం తదితరులు పాల్గొన్నారు.