అమెరికా విదేశాంగ మంత్రి ఇండియా పర్యటన

అమెరికా విదేశాంగ మంత్రి ఇండియా పర్యటన

12-06-2019

అమెరికా విదేశాంగ మంత్రి ఇండియా పర్యటన

తన ఇండియా పర్యటన కీలకమైందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పోంపియో వ్యాఖ్యానించారు. చైనా కాలుదువ్వుతున్న తరుణంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అరమరికలు లేని, స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రచించిన వ్యూహంలో భాగమే తన పర్యటన అని, ఇండియాతో అమెరికా ఊహాతీతమైన సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తోందని పోంపియో పేర్కొన్నారు.  ఆయన జూన్‌ 24న ఇండియాకు బయలుదేరుతారని విదేశాంగ ప్రతినిధి మోర్గాన్‌ ఓర్టాగస్‌ మీడియాకు తెలిపారు. జూన్‌ 28-29 లో జపాన్‌ ఒసాకాలో జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశంలో మోడీ, ట్రంప్‌ కలుసుకోబోతున్న నేపథ్యంలో పొంపియో పర్యటించబోతున్నారు.