డీడీఎస్ కు ఐరాస అవార్డు

డీడీఎస్ కు ఐరాస అవార్డు

12-06-2019

డీడీఎస్ కు ఐరాస అవార్డు

ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి (ఐరాస) అవార్డును తెలంగాణలోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) గెలుచుకుంది. వాతావరణ మార్పుల్లో సమస్యలు, స్థానిక సుస్థిరాభివృద్ధికి స్థానిక, వినూత్న, సహజ పరిష్కార మార్గాలను చూపినందుకు గుర్తింపుగా రెండేళ్లకోసారి ఇచ్చే ఈక్వేటర్‌ ప్రైజ్‌-2019కు ఎంపికైన 22 సంస్థల్లో డీడీఎస్‌ ఒకటి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకంలో భాగంగా ఉన్న ఈక్వేటర్‌ ఇనీషియేటివ్‌ నిర్వహించిన ఎంపికలో ఈ అవార్డుకు అర్హత సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలోని 75 గ్రామాలకు చెందిన 5వేల మంది సభ్యులతో గత రెండున్నర దశాబ్దాలుగా డీడీఎస్‌ పనిచేస్తోంది. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగే కార్యక్రమంలో విజేతలను సన్మానిస్తారు.