భారత్ పై మరోసారి అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

భారత్ పై మరోసారి అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

12-06-2019

భారత్ పై మరోసారి అసహనం వ్యక్తం చేసిన ట్రంప్

అమెరికాకు చెందిన ఖరీదైన హ్యార్లీ డేవిడ్సన్‌ మోటర్‌ బైక్‌ లపై అత్యధిక సుంకాలను విధిస్తున్నారని దీన్ని తాము అంగీకరించలేమని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ఒక బ్యాంకులాంటిదని.. ప్రతి ఒక్కరు తమ దేశాన్ని దోచుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. తన నాయకత్వంలో ఇలాంటి దోపిడీలు ఎంతో కాలం సాగవని హెచ్చరించారు. తమ మోటర్‌ బైక్‌ లపై భారత్‌ 100 శాతం సుంకాన్ని విధించిందని.. ఇదే సమయంలో తాము మాత్రం ఎలాంటి సుంకాలను విధించలేదని తెలిపారు. తన కోరిక మేరకు ఈ సుంకాన్ని మోదీ 50శాతానికి తగ్గించారని.. దీన్ని కూడా తాము అంగీకరించలేమని... ఈ సుంకాన్ని సున్నా శాతానికి తీసుకొస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలను వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటని ట్రంప్‌ విమర్శించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అధిక సుంకాలను వసూలు చేస్తోందని అన్నారు. భారత్‌ ను సుంకాల రారాజుగా అభివర్ణించారు.