తామిద్దరం ప్రేమలో పడ్డాం : ట్రంప్‌

తామిద్దరం ప్రేమలో పడ్డాం : ట్రంప్‌

12-06-2019

తామిద్దరం ప్రేమలో పడ్డాం : ట్రంప్‌

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నుంచి మరో అందమైన ఉత్తరాన్ని అందుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అణ్వాయుధాలను వదిలిపెట్టే అంశంపై ఎలాంటి పురోగతి లేనప్పటికీ కిమ్‌ మాట మీద నిలబడతారన్న నమ్మకం ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే లేఖలో కిమ్‌ ఏమి రాశారన్నది బయట పెట్టలేదు. గతంలోనూ కిమ్‌ రాసిన లేఖను అందమైనదిగా అభివర్ణించిన ట్రంప్‌.. తామిద్దరం ప్రేమలో ఉన్నమన్నారు. కొరియా ద్వీపాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కిమ్‌తో ట్రంప్‌ రెండుసార్లు సమావేశమైనప్పటికీ ఉత్తర కొరియా ఈ అంశంపై తమ వైఖరిని మార్చుకునేలా కన్పించడంలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి.