సిలికాన్‌ వ్యాలీలో ఘనంగా టీఆర్‌ఎస్‌ రెండో జాతీయ సదస్సు
MarinaSkies
Kizen
APEDB

సిలికాన్‌ వ్యాలీలో ఘనంగా టీఆర్‌ఎస్‌ రెండో జాతీయ సదస్సు

16-05-2017

సిలికాన్‌ వ్యాలీలో ఘనంగా టీఆర్‌ఎస్‌ రెండో జాతీయ సదస్సు

టీఆర్‌ఎస్‌ అమెరికాశాఖ రెండవ జాతీయ సదస్సు కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్‌ వ్యాలీలో టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ బే ఏరియాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ లోగో, ఫేస్‌బుక్‌ పేజీని టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ వ్యవస్థాపకుడు మహేశ్‌ తన్నీరు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్‌ బీగాల మహేశ్‌, నాగేందర్‌ మహీపతి, రజినీకాంత్‌ కుసానం, ననీన్‌ కానుగంటి, తక్కళ్లపల్లి అరవింద్‌ కలిసి ఆవిష్కరించారు. పలువురు ఎన్నారైలకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ ద్వారా ప్రచారం కల్పించాలని బీగాల మహేశ్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నారైశాఖలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో చందుతాళ్ల, వెంగల్‌  జలగం, సుక్రునాయక్‌, బిందు చీడెల్ల, నరసింహ నగల వాంచ, మహేశ్‌ పొగాకు, టోనీజాన్‌, మోహన్‌ గోలి, కృష్ణ బొమ్మిడి, నవీన్‌ జలగం, భాస్కర్‌ మద్ది, అభిలాష్‌ రంగినేని, శ్రీనివాస్‌ పొన్నాల, శశి దొంతినేని, రుషికేశ్‌, యశ్వంత్‌, అజయ్‌సాగి తదితరులు పాల్గొన్నారు.