టాంటెక్స్ ఆద్వర్యంలో డాల్లస్ లో డా. వందేమాతరం శ్రీనివాస్ గారికి ఘనసత్కారం

టాంటెక్స్ ఆద్వర్యంలో డాల్లస్ లో డా. వందేమాతరం శ్రీనివాస్ గారికి ఘనసత్కారం

15-06-2019

టాంటెక్స్ ఆద్వర్యంలో డాల్లస్ లో డా. వందేమాతరం శ్రీనివాస్ గారికి ఘనసత్కారం

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) జూన్ 11న దేశీప్లాజా స్తూడియోస్ లో ఏర్పాటు చేసిన “డా. వందేమాతరం శ్రీనివాస్ గారితో ముఖాముఖి ”  అనే కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ఘనంగా నిర్వహించ బడినది. సంస్థ 2019 అధ్యక్షులు చినసత్యం వీర్నపు ఆధ్వర్యంలో, డా. తోటకూర ప్రసాద్ గారు డా. వందేమాతరం శ్రీనివాస్ గారితో ముఖాముఖి ఘనంగా నిర్వహించారు. ముందుగా చినసత్యం వీర్నపు అందరికి స్వాగతం పలికి, టాంటెక్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి సభకు టాంటెక్స్ కార్యవర్గ సభ్యులను పరిచయం చేసి, వారి సహాయ సహకారాలతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగగుతున్నాం అని చెప్పారు. తరువాత డా. ప్రసాద్ తోటకూర గారిని ముఖ్య అతిధిగా విచ్చేసిన డా. వందేమాతరం శ్రీనివాస్ గారిని సభకు పరిచయం చేసి వేదిక మీదకు ఆహ్వానించవసిందిగా కోరారు. డా. వందేమాతరం గారిని పుష్పగుచ్చం తో కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, శ్రీకాంత్ రెడ్డి జొన్నల సత్కరించారు.

డా. తోటకూర ప్రసాద్ గారు ముఖాముఖి లో డా. వందేమాతరం గారి బాల్యం, సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి, బాల్యం నుంచి సినిమా రంగంలో చేరేవరకు తను ఎదుర్కొన్న ఆటు పాటులు, మొదటి సినిమా అవకాశం వంటి సందర్భాలను అభిమానులతో పంచుకొవలసిందిగా కోరారు. డా. వందేమాతరం గారు చిన్నప్పటి నుంచి సినిమా అన్న చాలా మక్కువ అని, సినిమాలు చూసి పాటలు నేర్చుకున్నాను అని, సూపర్ స్టార్ కృష్ణ గారి "అల్లూరి సీతారామరాజు" సినిమా చాలసార్లు చూసి పాటలు నెర్చుకున్నాను అని   చెప్పారు. అన్నింటికంటే తను అన్నగా నమ్మిన నల్లూరి వెంకట్రావు గారు జీవితంలో ఒక గాయకునిగా నిలబెట్టడంలో  చూపినంచిన ప్రేమ, ఆదరణ మరువరానిదని చెప్పారు. మొట్టమొదటి పాట "విప్లవ శంఖం" సినిమాలో డా.చక్రవర్తి గారు దగ్గర పదానని చెప్పారు. తనకు  "భూమికోసం" సినిమాలో "ఎవరో వస్తారని" అనే పాట చాల ఇష్టం అని, తరువాత తాను పాడిన "నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా", "వందేమాతరం","కాలేజి కుర్రవాడ, "కులాసాగ తిరిగెటోడ", "ఓసేయ్ రాములమ్మ", "ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు ఈ పాట్లు పడతారు" పాటలను పాడి అందరి మన్ననలు పొందారు. ప్రవాస భారతీయులు, అభిమానులు అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని డా. వందేమాతరం శ్రీనివాస్ గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.

ముఖ్యఅతిధి డా. వందేమాతరం శ్రీనివాస్ గారిని టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, సతీష్ బండారు, శ్రీకాంత్ రెడ్డి, పాలకమండలి అధిపతి యన్.యం.యెస్.రెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు.  టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ వీర్నపు చినసత్యం మాట్లాడుతూ డా. వందేమాతరం గారు టాంటెక్స్ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా వుందని, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మరియు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రసార మాధ్యమాలైన టీవీ9​, టివి5 , మన టివి, టి.ఎన్.ఐ, ​​ఫన్ ఏషియా, దేసిప్లాజ, తెలుగు టైమ్స్, ఐఏసియా లకు, పసందైన మిని డిన్నర్ అందించిన సారేగమ రెస్టారెంట్ వారికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విశ్వనాధ్ పులిగండ్ల, రావు కలవల, డా. పూదుర్ జగదీశ్వరన్, సి.ఆర్.రావు, లెనిన్ వేముల, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరి మరియు పలు ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.  కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.

Click here for Event Gallery