డొనాల్డ్ ట్రంప్ ఎవరినైనా పదవి నుంచి తొలగిస్తారు
MarinaSkies
Kizen
APEDB

డొనాల్డ్ ట్రంప్ ఎవరినైనా పదవి నుంచి తొలగిస్తారు

16-05-2017

డొనాల్డ్ ట్రంప్ ఎవరినైనా పదవి నుంచి తొలగిస్తారు

ఎఫ్‌బిఐ చీఫ్‌ జేమ్స్‌ కొమెను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వస్తున్న విమర్శలను ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీహేలీ ఖండించారు. ట్రంప్‌ అమెరికాకు సీఈవో వంటి వారని, ఆయన తలచుకుంటే ఎవరినైనా పదవి నుంచి తొలగిస్తారని సృష్టం చేశారు. ఆయన ప్రవృత్తి నచ్చనివారికి ఈ చర్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా పాల్పడుతున్న దుందుడుకు చర్యలపై స్పందించిన నిక్కీ హేలీ ఆ దేశం క్షిపణి పరీక్షలు చేస్తుంటే కిమ్‌ జంగ్‌తో తమ దేశ అధ్యక్షుడు చర్చలు జరిపే ప్రస్తావనే లేదని అన్నారు.