ట్రంప్ కు సమాధానం చెప్పాల్సిన అసవరం లేదు

ట్రంప్ కు సమాధానం చెప్పాల్సిన అసవరం లేదు

15-06-2019

ట్రంప్ కు సమాధానం చెప్పాల్సిన అసవరం లేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇరాన్‌ అద్యక్షుడు హసన్‌ రౌహానీ జపాన్‌ ప్రధాని షింజో అబేతో అన్నారు. ఇరాన్‌, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించేందుకు షింజో అబే మధ్యవర్తిత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్దరణ అంశంపై షింజో అబే రౌహానీతో చర్చించారు. ట్రంప్‌ పంపిన సందేశాన్ని షింజో అబే ఇరాన్‌ ముందుంచారు. అయితే, ట్రంప్‌కు తిరిగి సమాధానం ఇవ్వాల్సినంత గౌరవం ఆయన ఉంచుకోలేదని రౌహాని మండిపడ్డారు. కాగా,అంతర్జాతీయంగా ప్రాధా గల్ఫ్‌ ఆఫ్‌ ఓమన్‌లోని ఆయిల్‌ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శాంతి చర్చల కోసం జపాన్‌ రంగంలోకి దిగింది. ఇరాన్‌పై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే బాధ్యత జపాన్‌ తీసుకుంది.