అమెరికా టెక్ దిగ్గజాలకు పెద్ద షాక్

అమెరికా టెక్ దిగ్గజాలకు పెద్ద షాక్

15-06-2019

అమెరికా టెక్ దిగ్గజాలకు పెద్ద షాక్

అమెరికా బెదిరింపులకు, ఆంక్షలకు ధీటుగా సమాధనం చెప్పిన చైనా మొబైల్‌ తయారీ దిగ్గజ సంస్థ హువావే కీలక విషయాన్ని ప్రకటించింది. తన సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను (ఓఎస్‌) తొందరలోనే లాంచ్‌ చేయనున్నామని ప్రకటించింది. మమ్మల్ని తక్కువగా అంచన వేయొద్దని ప్రకటించిన హువావే ఆండ్రాయిడ్‌కు ప్రత్యామ్నాయంగా హాంగ్‌మెంగ్‌ పేరుతో కొత్త ఓఎస్‌ను లాంచ్‌ చేయనుంది. తద్వారా అమెరికా టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఆపిల్‌కు పెద్ద షాక్‌ ఇస్తోంది.