గూగుల్‌ సీఈవో హెచ్చరిక...

గూగుల్‌ సీఈవో హెచ్చరిక...

15-06-2019

గూగుల్‌ సీఈవో హెచ్చరిక...

మమ్మల్ని నియంత్రించాలి కాబట్టి నియంత్రణలు విధిస్తే సంబంధిత పరిణామలు ఊహకు అందవని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. నమ్మకాన్ని వమ్ము చేసిన కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో పిచాయ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టెక్‌ దిగ్గజాలను నియంత్రించాలనుకోవడంపై ఆయన హెచ్చరించారు. సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఇటువంటి దర్యాప్తును ఐరోపా సంఘంలో ఎదుర్కొన్నామని అందుకే తాను ఇప్పుడేమీ ఆశ్చర్యపోవడం లేదని ఆయన తెలిపారు. యాంటీ ట్రస్ట్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గూగుల్‌పై కేసులు పెట్టేందకు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సిద్ధమవుతోంది. 2010లో షాపింగ్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌కు గూగుల్‌ వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని 2010లో ఫిర్యాదు దాఖలైంది. దీంతో 2017లో గూగుల్‌పై 2.7 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించారు.